On Shop Owner Got Rs.65 Lakhs Electricity Bill at Karimnagar District.
అప్పుడప్పుడు కరెంట్ బిల్లులు చూస్తుంటే కూడా గుండేపోటు వచ్చేలా తయారైంది పరిస్థితి. ఇటీవల ఇంటింటా పనిచేసే ఓ వృద్ధురాలికి లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. మొన్నామధ్య ఓ సెలూన్‌కు కూడా లక్షల్లో కరెంట్ బిల్లు రావడంతో అవాకయ్యాడు. తీరా విద్యుత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సాంకేతిక లోపం కారణంగా జరుగవచ్చని సమాధానమిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది.
తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన తిప్పర్తి రత్నాకర్ అనే వ్యక్తికి చెందిన దుకాణానికి రూ. 65 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లును చూసిన రత్నాకర్ లబోదిబోమన్నాడు. 43 రోజులకు రూ. 65,38,402 బిల్లు రావడమేంటని ఆశ్చర్యపోయిన రత్నాకర్.. విద్యుత్ అధికారులను సంప్రదించాడు. దీంతో టెక్నికల్ లోపం వల్లనే బిల్లు వచ్చినట్లు బాధితుడుకి విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రత్నాకర్ ఊపిరిపీల్చుకున్నాడు.