చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము, ఇక నుండి ఆఫ్ లైన్ లో తరగతులు ఉంటాయి. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఉపాధ్యాయుల హాజరుకావాలి అని తెలిపారు.