ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డును సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు.
పాఠశాలకు దారి వెలుగుకు మార్గం.. సావిత్రి బాయి ఫూలే దేశంలోని స్త్రీలు, షెడ్యూల్డ్ కులాలలో విద్యా జ్యోతిని మేల్కొల్పారు అని వ్యాఖ్యనించారు. వారి వల్లనే మన సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు చోటు దక్కింది అంటూ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారాయి.చంద్రబాబు అరెస్టు జరిగిన నేపథ్యం లో టీడీపీ నిరసన కొనసాగిస్తుంది. అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా టీడిపి ఎమ్మెల్యే లు తీవ్రస్థాయి లో నిరసన తెలుపుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.టీడీపీ ఎమ్మెల్యే ల తీరు సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఏపి శాసన మండలిలో విద్యా శాఖ…
Bihar Education Minister Chandrashekar Comments On Prophet Muhammad: మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాహిల్సా సబ్ డివిజన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను మర్యాద పురుషోత్తముడు అని అభివర్ణించారు. ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో నిజాయితీ అంతరించి పోయి, దుర్మార్గులు,చెడు పెరిగాయో అప్పుడు దైవం మీద నమ్మకం కలిగించడానికి దేవుడు మర్యాద పురుషోత్తముడు…
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
డీఈఓలు, ఆర్జేడీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు మంత్రి సబితా సలు సూచనలు చేశారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54వేల 201 మంది కుక్-కమ్ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.డిఎస్‌సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు..అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ గారు ప్రకటించారు..కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయింది.గడిచిన ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు.డి.ఎడ్, బి.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ…
రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం...తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు.
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఎక్సామ్స్ రాయనున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వం వరసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే గ్రూప్1, పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు రాగా… త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే టెట్ కోసం ఆల్ రెడీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే టెట్ ఎగ్జామ్ డేట్ మార్చాలంటూ పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ ఎగ్జామ్ జరిగే జూన్ 12న ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం…