తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు.
ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది. అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు…
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము, ఇక నుండి ఆఫ్ లైన్ లో తరగతులు ఉంటాయి. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్…
ప్రైవేటు ఆర్టీపీసీఆర్ లాబ్స్ ను ఆకస్మికంగా తనిఖీలు చేసారు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వం నిర్ధేశించిన ధర కంటే అధిక రుసుములు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పేర్కొన్నారు. మైక్రో లాబ్, మైల్ స్టోన్ లాబ్ కు లక్ష రూపాయల జరిమానా విధించారు. యూనటస్ లాబ్ పై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన పరీక్షల శాంపిల్స్ ను కావాలనే ప్రైవేటు లాబ్స్ వారు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఇకనుండి…