Bandi Sanjay: 2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎం కు లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండించారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను కలవడానికి వెళితే బీజేవైఎం, పోలీస్ పరీక్ష అభ్యర్థులపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారన్నారు. పోలీసు రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉన్న అసంబద్ధ నిబంధనలు మార్చాలని మొరపెట్టుకున్న విన కుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్ష నిబంధనను మార్చాలని నేను స్వయంగా సీఎం గారికి లేఖ రాసినా స్పందించలేదని గుర్తు చేశారు బండి సంజయ్.
Read also: Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్‌లే ట్విస్టులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉందట!
2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా? అంటూ ప్రశ్నించారు. వీళ్ళ బాధలు వినలేనంతగా తీరిక లేకుండా సీఎం ఏమి ఘనకార్యం వెలగ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకి న్యాయం చేయాలన్నారు. పరీక్ష రాసిన వేలమంది రోడ్డు మీదకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం అర్థం చేసుకోవాలని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.
Read also: Itchy Scalp: తల దురదగా ఉందా.. ఈ రెమిడీస్ మీ కోసమే!
పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా బీజేవైఎం శ్రేణులు ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. బీజేవైఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుళ్ల నియామకాల విషయంలో గతంలో ఉన్న నిబంధనలనే కొనసాగించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
Kishan Reddy: కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు.. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదు