కొందరికి ఎప్పుడూ తల దురదగా ఉంటుంది. దీని వల్ల జుట్టు రాలే అవకాశముంది. అయితే.. ఈ రెమెడీస్‌తో ఆ సమస్యకి చెక్ పెట్టొచ్చు.

నీటిలో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి, ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి, కాసేపయ్యాక నీటితో కడగాలి.

పెప్పర్ మింట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ని బాగా కలిపి.. తలపై రుద్దాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

అలోవెరా జెల్‌ని నీటితో కడిగా.. నేరుగా తలపై మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ రసంతో శుభ్రమైన కాటన్ బట్టను తడిపి, తలకు అప్లై చేయండి. కాసేపు తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి.

వేప ఆకుల్ని ఉడకబెట్టి రుబ్బాలి. ఆ రసాన్ని పిండి, తలపై మసాజ్ చేయాలి. అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి.

నిద్రపోయే ముందు అర్గన్ ఆయిల్‌ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

రాత్రి ఆలివ్ ఆయిల్‌ని గోరువెచ్చగా చేసి, తలకు పట్టించి మసాజ్ చేయాలి. అనంతరం ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.