తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్ నడుస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. . పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానన్నారు తమిళి సై. ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రెస్ మీట్ పై కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ కు ప్రభుత్వం చేసిన చట్టాలను తిరిగి వెనక్కి పంపించే హక్కు లేదన్నారు.
Read Also: Governor Tamilisai: నేను బిల్లులను తొక్కిపెట్టలేదు.. పరిశీలిస్తున్నానంతే!
ప్రభుత్వం చేసిన చట్టాలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు. అలాగే గవర్నర్ కార్యాలయం ప్రత్యుత్తరాలు చేయొచ్చు..కానీ ఇలా మొండిగా బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్ద నెలల తరబడి ఉంచుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు కూనం నేని సాంబశివరావు. బిల్లుల ఆమోదంపై గవర్నర్కు సూపర్ పవర్ ఉందని చెప్పుకుంటుంది.. అలాంటివేమీ రాజ్యాంగంలో గవర్నర్లకు కల్పించలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలకు ఆమోదముద్ర వేయాల్సిన బాధ్యత గవర్నర్ ది. కేవలం గవర్నర్ రబ్బర్ స్టాంపు మాత్రమే అన్నారు.
Read Also: Malavika Mohanan: బెడ్ పై ఏ హీరో హాట్.. నోరు జారి బుక్ అయిన మాస్టర్ బ్యూటీ
నీకు రాజకీయాలు చేయాలనుకుంటే, బిజెపి కండువా డ్రెస్ వేసుకొని మీ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోండి. తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్లకక్కుతుంది మీరు..కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు విషయం పక్కన పెడితే..మిగిలిన బిల్లును ఎందుకు ఇప్పటి వరకు ఆమోదించలేదో గవర్నర్ వెల్లడించాలి..ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుకు కారణం కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిన హామీలను,సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతిభవనైనా రాజ్ భవనైన ఆందోళన చేసే హక్కు విద్యార్థులకు ఉంటుంది.. ఆమె ఫోన్ కూడా ప్రభుత్వం టాపింగ్ చేస్తుందని గవర్నర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు కూనంనేని. ఇప్పటికైనా గవర్నర్ పేచీలు పెట్టుకోవడం మానేసి గవర్నర్ గా పనిచేయాలని హితవు పలికారు.