ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్‌కు గురవుతారని.. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గానీ.. ఒక మంత్రి గానీ.. ఒక ప్రధానమంత్రి గానీ జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు.
చట్టసభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో ఈ వివాదం బాగా ముదురుతోంది. ఇటీవల తమిళనాడు గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇలాంటి రగడే జరిగింది.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో.. సభ నిర్వహణ విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో బీజేపీయేతర రాష్ట్రాల్లో గర్నవర్ల వర్సెస్ ప్రభుత్వాలు అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలగాంణ, తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు గవర్నర్ వ్యవస్థపై తీవ్రం మండిపడుతున్నాయి.