CM Revanth Reddy: మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరాను.. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించారని తెలిపాం.. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీకి పలు వినతులు చేశాం.. హైదరాబాద్- బెంగళూరు- చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. ఇక, ఆర్ఆర్ఆర్ సౌత్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Putin India Visit: డ్రోన్లు, స్నైపర్లు, కమాండోలు.. పుతిన్‌కు 5 అంచెల భద్రత..
అలాగే, నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో విభిన్న రకాల మనస్తత్వాలపై చెప్పే ప్రయత్నం చేశాను.. డీసీసీ అధ్యక్షులు వయస్సులో చిన్నవాళ్లైనా, పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు. ఇక, తెలంగాణలో మరో రెండు టర్ములు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు.
Read Also: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. చిన్నారులపై రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల దాడులు..
ఇక, డిసెంబర్ 8, 9న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. అలాగే, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించిన ఆహ్వాన పత్రికను వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.