Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే నటులలో అల్లరి నరేష్ ముందు వరసలో ఉంటాడు. గత కొంత కాలంగా కామెడి సినిమాలు పక్కన పెట్టేసి సీరియస్ సినిమాలపై ఫోకస్ చేసాడు అల్లరి నరేష్. కానీ ఒకప్పటి సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. ఇక విలక్షణమైన కథలను ఎంచుకుని తనకట్ను ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నాడు నారా రోహిత్. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం.
Also Read : Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్
Also Read
నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్ నిమ్మలపూడి ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మొదటి సినిమాతోనే తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్న వెంకటేశ్, ఈసారి అల్లరి నరేష్ మార్కు కామెడీని, రోహిత్ సెన్సిబుల్ నటనను జోడించి ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని భగవంత్ కేసరి, కృషార్జున యుద్ధం వంటి సినిమాలకు సహా నిర్మాతగా వ్యహరించిన హరీష్ పెద్ది సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశ ముగిసి, ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నారా రోహిత్, అల్లరి నరేష్ ఇద్దరు మంచి నటులు సరైన కథ పడితే హిట్ కొట్టడం పక్క. మరి ఈ ఇద్దరు తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!