Putin India Visit: డ్రోన్లు, స్నైపర్లు, కమాండోలు.. పుతిన్‌కు 5 అంచెల భద్రత..
- పుతిన్ భారత పర్యటనలో భారీ భద్రత..
- 5 అంచెల భద్రతా ఏర్పాట్లు..
- కమాండోలు, స్నైపర్లు, ఏఐ సాయంతో పర్యవేక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నునంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శిస్తున్న పుతిన్ రేపు సాయంత్రం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో కలిసి పుతిన్ డిన్నర్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు లాంఛనప్రాయ స్వాగతం పలుకుతారు. శుక్రవారం, ఆయన రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. దీని తర్వాత, హైదరాబాద్ హౌజ్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి, ఆ తర్వాత భారత మండపంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందులో కూడా ఆయన పాల్గొంటారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Read Also: Shocking Incident: అత్తగారింటికి వచ్చిన 20 నిమిషాలకే విడాకులు.. కంగుతిన్న పెళ్లికొడుకు..
పుతిన్ భద్రత కోసం రష్యా నుంచి 40 మందికి పైగా భద్రతా అధికారులు, సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్‌జీ భద్రతా అధికారులు పుతిన్ ప్రయాణించే మార్గాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక మంది స్నైపర్లు పుతిన్ కదలిక మార్గాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేస్తారు. ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ వంటి కెమెరాలను పతిన్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. పుతిన్ ల్యాండ్ అయిన మరుక్షణం నుంచి ఆయనకు 5 లేయర్డ్ సెక్యూరిటీ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతుంది. ఎన్ఎస్‌జీ, ఢిల్లీ పోలీస్ అధికారులు బయట అంచెల భద్రతా విభాగంగా ఉంటారు. రష్యన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ లోపలి వలయంలో ఉంటారు. రష్యా అధ్యక్షుడు, మోడీని కలిసినప్పుడు ప్రధానికి భద్రత కల్పించే భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతా వలయాన్ని పర్యవేక్షిస్తారు.
రష్యా అధినేత బస చేసే హోటల్‌ని ఇప్పటికే భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పుతిన్ పర్యటించాల్సిన ప్రదేశాల్లో కూడా రష్యన్ భద్రతా అధికారులు తనిఖీలను నిర్వహించారు. పుతిన్ ప్రత్యేకంగా ఆరస్ సెనాట్‌లో ప్రయాణించనున్నారు. దీనిని మాస్కో నుంచి విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. ఇటీవల, చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశంలో పుతిన్, మోడీలు ఇద్దరూ కలిసి ఇదే కారులో ప్రయాణించారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!