Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ లైవ్‌లో పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు వేదికైంది. ఆ పాటలోని పదాలు అత్యంత అసభ్యకరంగా ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ వివాదం ముదరడంతో చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. ఆ పాటలోని లిరిక్స్ విన్నప్పుడు తాము కూడా షాక్‌కు గురయ్యామని, అది తమ సినిమాలోని పాట కాదని వారు స్పష్టం చేశారు.
Also Read : Alia-Alpha : ఆలియా భట్ ‘ఆల్ఫా’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
Also Read
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఆ పాటలోని పదాలు తమను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు.. అంతే కాదు ‘సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం మాకు లేదు. ఆ సమయంలో హీరో అలా పాడటం మాకు కూడా తెలియదు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో మేము కష్టపడ్డాం, కానీ ఇలాంటి వివాదం వల్ల సినిమా పరువు పోవడం బాధగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలం ఉన్న పాటలకు తమ సినిమా మద్దతు ఇవ్వదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పాటపై వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే, హీరో అతి ఉత్సాహం సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చంద్రహాస్ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు, అయితే ఈసారి ‘బూతు పాట’ పాడటం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!