టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు వారి కెరీర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను వారి అభిమానులు మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేసి ఎంతో సందడి చేస్తున్నారు.తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు మరియు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇలా సందర్భం ఏదైనా కానీ పాత సినిమాలను ఫ్యాన్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.. రీ రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ కూడా పెరుగుతోంది. దీనితో నిర్మాణ సంస్థలు సైతం లను రీరిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వెండి తెరపై మళ్లీ తళుక్కుమన్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో కల్ట్ క్లాసిక్ మూవీ కూడా వచ్చి చేరుతోంది. అదే హ్యాపీడేస్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో యూత్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2007లో వచ్చిన ఈ సినిమా కుర్రకారును ఊపేసింది. కాలేజీ స్టూడెంట్స్ అంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతోన్న కూడా ఇప్పటికీ టీవీలో వస్తే మొదటి సారి చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఈ సినిమా ఇప్పటి స్టూడెంట్స్‌కు కూడా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, ప్రేమలు.. ఇలా జీవితంలోని ఒక భాగాన్ని శేఖర్ కమ్ముల అద్భుతంగా చూపించి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు.ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.తాజాగా హీరో నిఖిల్ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఈ సినిమా రీ రిలీజ్ గురించి ఆసక్తికర ట్వీట్ చేసారు.నిఖిల్ సిద్ధార్థ హ్యాపీడేస్ చిత్రం ద్వారానే వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీడేస్ రీ రిలీజ్ ఒకేనా.?’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది
https://x.com/actor_Nikhil/status/1703472938488340712?s=20