PM MODI:తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే.. కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ ఆయా జిల్లాలకు వెళ్లి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఫిబ్రవరి 5న హైదరాబాద్ నగరానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 న మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు. అక్కడ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ…