Shinzo Abe: షింజో అబేను అందుకే కాల్చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యపై దర్యాప్తు కొనసాగుతుండగా, అబేను కాల్చి చంపిన తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి జపాన్ నేవీలో మూడేళ్లపాటు పనిచేసినట్లు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. పశ్చిమ జపాన్‌లోని నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి శుక్రవారం ప్రచార ప్రసంగంలో అబేపై కాల్పులు జరిపాడు. మొదట తన తల్లి ఆర్థికంగా నష్టపోవడానికి కారణమైన ఓ మతానికి చెందిన నాయకుడిపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు యమగామి పోలీసులకు వెల్లడించినట్లు క్యోడో న్యూస్ వెల్లడించింది. ఆదివారం నాటి హౌస్ ఆఫ్ కౌన్సిలర్ల (జపాన్ నేషనల్ డైట్ ఎగువ సభ) ఎన్నికలకు ముందు అబే ప్రచార ప్రసంగాలు చేసిన ఇతర ప్రదేశాలను తాను సందర్శించినట్లు యమగామి అంగీకరించినట్లు పలు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.
“షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ, అసంతృప్తితో రగిలిపోతున్నానని, అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆయనకు చికిత్స అందుతుండడంతో తాను నిరుత్సాహానికి లోనయ్యాను” అంటూ విచారణలో పోలీసుల ఎదుట సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. అబే హత్య తర్వాత పోలీసులు శుక్రవారం యమగామి ఇంట్లో సోదాలు చేశారు. అతడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులను గుర్తించినట్లు ఓ వార్తా సంస్థ నివేదించింది. యమగామి ప్రస్తుతం నిరుద్యోగి. అయితే, అతను దాదాపు 2020 కాన్సాయ్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు జపాన్ మీడియా తెలిపింది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగిగా పేర్కొంది. 2005 వరకు నేవీలో పనిచేశాడని వెల్లడించింది.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
Elon Musk: అమెరికా అధ్యక్షుడిపై ఎలన్ మస్క్ సెటైర్.. !
శనివారం ఉదయం అబే మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. రక్తస్రావంతో అబే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్షలో షింజో అబే ఎడమ చేయి, మెడపై రెండు తుపాకీ గాయాలు ఉన్నాయని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మెడపై మరో గాయం ఉందని, అయితే అది ఎలా జరిగిందో తెలియలేదని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!