నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో దేవి రెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు, గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది..
యూపీలోని బదౌన్‌లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ…
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో కత్తితో ఓ వ్యక్తి హంగామా సృష్టించారు. తన భార్య కత్తితో పొడిచిందంటూ ఇంటి ముందు కేకలు పెట్టాడు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read also: Pineapple For Hair: అన్ని జుట్టు సమస్యలకు పైనాపిల్‌తో ఇలా చెక్.. జగిత్యాలకు చెందిన దంపతులు గత కొంతకాలంగా అర్బన్…
ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.