Corona new varient telangana: కొత్త వేరియంట్ రూపంలో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలో ప్యాసింజర్ స్క్రీనింగ్‌తో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌తో కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.
Read also: Kishan Reddy: ఆ పంట సాగుకు అనుకూలమైన భూమి తెలంగాణలోనే ఉంది
రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని, కరోనా ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉంది. డిసెంబర్ 21న తెలంగాణలో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34 మాత్రమే అని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బీఎఫ్ 7 వేరియంట్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నామని, వారి నమూనాలను పరిశీలిస్తున్నామని వివరించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడింది.