BRS Vinod Kumar Satires On PM Narendra Modi: వ్యాగన్ రిపేర్ యూనిట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం ఆశ్చర్యకరమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి బీజేపీ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసిందని అన్నారు. ఇటీవల అయోధ్యపురంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ బృందంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ పరిశ్రమని పరిశీలించిన అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ ఎన్నో రోజులుగా పోరాడుతోందని అన్నారు. ఆ ఫ్యాక్టరీ కోసం ప్రధానిని బీఆర్ఎస్ ప్రశ్నించిందని అన్నారు.
Posani Krishna Murali: పవన్‌కి పోసాని ఛాలెంజ్.. నీకు ఆ దమ్ముందా?
అయితే.. కాజీపేటకు రావాల్సిన ఆ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ అమృత్‌సర్‌కు తరలించారని వినోద్ కుమార్ మండిపడ్డారు. రైల్వే శాఖ మంత్రిగా ఎవరుంటే, వాళ్లు తరలించుకుపోయారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల వస్తున్న తరుణంలో.. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని తాను అనుకున్నానన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పోరాటం చేయడం వల్లే.. విభజన చట్టంలో హమీలను చేర్చారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేవలం కాజీపేటకే పరిమితం కాదని.. ఇది యావత్ తెలంగాణ ప్రజల డిమాండ్ అని చెప్పారు. బీఆర్ఎస్ పోరాటంతో.. కాజీపేట POH నుండి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సాధించామన్నారు. విజన్‌తో పనిచేసే ఏకైక సీఎం కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నారు.
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..