ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న ఈ ఎడమచేతివాటం బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్.. కేన్ విలియమ్సన్ తొలి స్థానంలో నిలబెట్టుకున్నాడు.
Read Also: Posani Krishna Murali: పవన్‌కి పోసాని ఛాలెంజ్.. నీకు ఆ దమ్ముందా?
ఇక, టీమిండియా తరపున కేవలం ఒకే ఒక్క బ్యాటర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.. అతడే రిషబ్ పంత్.. నిలకడగా కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్ల 14వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(9), స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా(10) ఒక్కో స్థానం దిగజార్చుకుని టాప్-10లో కొనసాగుతున్నారు.
Read Also: Kavya Kalyanram: ఆ డైరెక్టర్ బాడీ షేమింగ్ చేశాడు.. బలగం హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భాగంగా టీమిండియా విండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఇవాళ( బుధవారం) ఆడనుంది. ఇవాళ్టి నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.