హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చార్మినార్ దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్, పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి.. ఓవైపు చార్మినార్‌కు తరలివచ్చే సందర్శకులు.. మరోవైపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వచ్చే భక్తులు.. ఇంకావైపు.. చార్మినార్ చుట్టూ.. అక్కడి ఫుట్‌పాత్‌లపై చిన్న వ్యాపారులు.. బొమ్మలు, వస్తువులు, డ్రెస్‌లు.. ఇలా ఎన్నో విక్రయిస్తుంటారు.. బాంబు బెదిరింపుల నేథఫ్యంలో.. ఆ ప్రాంతంలో అందరినీ ఖాళీ చేయించారు పోలీసులు.. మొత్తంగా ఈ వ్యవహారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోంది.
Read Also: Telangana BJP: ఇంఛార్జ్ బాధ్యతలు మాకొద్దు.. మొరపెట్టుకుంటున్న బీజేపీ నేతలు..!