తమను అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెద్దలకు మొరపెట్టుకున్నారు తెలంగాణ నేతలు.. అసెంబ్లీ ఇంఛార్జి బాధ్యతల నుండి తప్పించండి అంటూ మరో సారి బండి సంజయ్, తరుణ్ చుగ్‌ను కోరారు.. అయితే, పోలింగ్ బూత్ కమిటీలు వేసే బాధ్యత అసెంబ్లీ ఇంఛార్జిలదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.. ప్రతి బూత్ లో 22 మందితో కమిటీ వేయాల్సిందేనని.. లేకుంటే తప్పిస్తామని హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో తరుణ్ చుగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. మాకొద్దు ఆ బాధ్యతలు అంటూ పలువురు ఇంఛార్జిలు చేతులెత్తేశారట.. మా సొంత నియోజకర్గాల్లో పని చేసుకుంటాం.. కానీ, ఇంఛార్జ్ బాధ్యతలు మాకొద్దు అని చెబుతున్నారు నేతలు.. మా నియోజక వర్గాల్లో కమిటీలు వేసుకుంటామని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: Hari Hara Veera Mallu: కాషాయంలో పవర్ స్టార్… ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్
అయితే, రెండు నెలల క్రితమే అసెంబ్లీ ఇంఛార్జ్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు బీజవేపీ పెద్దలు.. కానీ, అదే సమయంలో.. పలువురు నేతలు.. దీనిని తిరస్కరించారు.. మేం పోటీచేయడానికి సిద్ధం అవుతున్నాం.. మా నియోజకవర్గాల్లోనే పనిచేసుకుంటామని పెద్దలకు చెప్పారు.. అయితే, మరోసారి మాకు ఇంఛార్జ్ బాధ్యతలు వద్దు అంటూ గొంతెత్తారు.. మా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటాం.. కమిటీలు వేసుకుంటాం.. కేంద్రీకరించి కార్యక్రమాలు నిర్వహిస్తాం.. మా నియోజకవర్గాల్లోనే పనిని కొనసాగిస్తామని.. ఆదివారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు.. ఇదే సమయంలో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నవారిని అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు పెట్టాలని పెద్దలకు సూచించారు పార్టీ నేతలు.. మరి, ఇంచార్జ్‌ల మొర ఆలకించి.. వారు పోటీచేస్తామని భావిస్తున్న నియోజకవర్గాలకే వారిని పంపిస్తారా? ఇప్పుడున్నట్టుగానే ఇంఛార్జ్‌లను కొనసాగిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.