సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటల వల్లే అధికారులు నిద్రపోయారని చురకలు అంటించారు. హరీష్ రావు మాటలు మాటలకే పరిమితమని… అమలులో మాత్రం ఉండవని మండిపడ్డారు. తెలంగాణను కాపాడేందుకు సీఎం- మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని…. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో రిలీజ్ చేసిందని తెలిపారు.
read also : తెలంగాణకు భారీ వర్ష సూచన
దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు టీఆరెస్ ప్రభుత్వం, నేతలు ఏడాదికి మెలుకున్నారని మండిపడ్డారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ -నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేము చెప్పినా కేసీఆర్ నిద్రలేవలేదని ఫైర్ అయ్యారు. నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఎకరానికి నీళ్లు తెలంగాణ సర్కార్ ఇవ్వలేదని… నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్షల కోట్లు ఖర్చుచేసినా కొత్త ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వలేదన్నారు.