తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని… నిన్న ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి ఉత్తర ప్రదేశ్ నుండి ఝార్ఖండ్ మీదగా దక్షిణ ఛత్తీస్ఘడ్ వరకు సముద్ర మట్టానికి 3.1కిమి నుండి 5.8 కిమి వరకు వ్యాపించి ఉన్నది. దీంతో రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉన్నాయని…. ఈ రోజు కొన్ని ప్రదేశాలలో… రేపు, ఎల్లుండి ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణ హెచ్చరికలు:- ఈరోజు ఉత్తర, తూర్పు తెలంగాణా జిల్లాలో ఒకటి, రెండు ప్రదేశములలో భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-