MLA Sunke Ravi Shankar: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు అనే బండి సంజయ్ వ్యాక్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాని అన్నారు. బండి సంజయ్ కి మతి భ్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని కోరారు. క్షుద్రపూజలు ఎవరు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లే క్షుద్రపూజలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో కూడా తనకు తెలియదని ఫైర్ అయ్యారు.
Read also: IND Vs SA: రెండో వన్డే నుంచి రుతురాజ్, రవి బిష్ణోయ్ అవుట్..!!
ఎంపీగా ఉండి బండి సంజయ్ పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రింద ఒప్పందం ప్రకారం రాజగోపాల్ రెడ్డి పార్టీ లో చేరాడని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసం పార్టీలో చేరాడని తీవ్రంగా మండిపడ్డారు. బండిసంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం యాగాలు చేసారని అన్నారు. లోక కల్యాణం కోసం కేసిఆర్ హోమాలు యజ్ఞలు చేసాని అన్నారు. బండిసంజయ్ కి దమ్ముంటే కరీంనగర్ కు ఏమి చేశావో చెప్పాలని అన్నారు.
Revanth Reddy: TRS పై పిటిషన్ వేశాను.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా పేరు మారదు