TS Vs AP: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరస్తులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉద్యోగానికి సెలవుపై వెళ్లి గంజాయి స్మగ్లింగ్‌కు యత్నించిన ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. ఇద్దరు ఏపీ పోలీసులు గంజాయి ప్యాకెట్లతో హైదరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే ఉలిక్కిపడేలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Read also: Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ (35), కానిస్టేబుల్ శ్రీనివాస్ (32) పశ్చిమగోదావరి జిల్లా కాకినాడ మూడో బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం హాయిగా సాగిపోతున్నా వారికి సంతృప్తి ఇచ్చేలా కనిపించడం లేదు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు ఆర్జించాలని ఆశచూపి ఈ ఇద్దరు పోలీసు స్మగ్లర్లుగా మారారు. అనారోగ్య కారణాలతో పోలీసు ఉద్యోగానికి సెలవు తీసుకున్న సాగర్, శ్రీనివాస్ నర్సీపట్నంలో గంజాయి సేకరించారు. ఈ ఇద్దరు కలిసి కారులో గంజాయిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి వారిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే వారిపై దాడి చేసి అనుమానంతో AP 39 QH 1763 MARUTHI ECO వాహనాన్ని పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సాగర్, శ్రీనివన్‌లను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. విచారణలో వారు చెప్పిన వివరాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. వారిద్దరూ ఏపీ పోలీసులని ఆరోగ్యం బాగాలేదని చెప్పి గంజాయి స్మగ్లింగ్‌కు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.
Mason Jobs: డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! నెలజీతం రూ.4.47 లక్షలు