Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. మరి నిన్ననే ఒకటో తేది. ఇది ఫిబ్రవరి నెలే. అంటూ గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. బీజేపీ యాత్రలు, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సమ్మేళనం, మహిళ స్వయం సహాయక సంఘాల సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, అయోధ్య దర్శన్, గోడ వ్రాతలు, వికసిత భారత్ సంకల్ప అంబాసిడర్ కార్యక్రమాలపై చర్చ నిర్వహించారు. కొత్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ వచ్చిన తర్వాత మొదటి సమావేశం అన్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లోకి ఫోన్ లు అనుమతి లేదని అన్నారు. ఎందుకంటే.. సమావేశం జరుగుతుంటే పోన్ లు చూసుకుంటూ కూర్చుంటున్న నేపథ్యం, మీటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టక పోవడంతో పోన్ లు అనుమతి ఇవ్వొద్దని నిర్ణయించామని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరిచేసుకావాలన్నారు.
Read also: Mason Jobs: డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! నెలజీతం రూ.4.47 లక్షలు
గ్రామ స్థాయిలో నిత్యం కొత్తగా చేరికలు ప్రోత్సహించాలని తెలిపారు. వేగంగా రాజకీయ సమీకరణాలు మారనున్నాయని అన్నారు. చేరికలు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళే కాదన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళను పార్టీలో చేర్చాలని తెలిపారు. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలన్నారు. మండలం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిజస్వరూపం బయటపెట్టుకున్న కాంగ్రెస్ అన్నారు. ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా అన్నారు. మరి నిన్ననే ఒకటో తేది.. ఇది ఫిబ్రవరి నెలే కదా అని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని కేంద్రమంత్రి గుర్తు చేశారన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందన్నారు. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
Bandla Ganesh: గత ప్రభుత్వం పై బండ్ల గణేష్ ఫైర్.. అంత మాట అనేశాడు ఏంటి?