Mason Jobs: తాపీ మేస్త్రీకి నెలవారీ ఆదాయం ఎంత ఉంటుంది? రోజుకు రూ. 1000 నుంచి 1500 లెక్క వేసుకున్నా నెలకు రూ.30-40 వేలు మధ్య ఉంటుంది. కుటుంబం కోసం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పనికి వెళ్లాల్సిన పరిస్థితులు వుంటాయి. కానీ అమెరికా కాన్సులేట్‌లో మేస్త్రీ ఉద్యోగానికి లక్షల్లో వేతనం ఇస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం.. జీవితమే తాపీ మేస్త్రీ అనుకునేలా లక్షల్లో జీతంతో ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
Read also: CM Revanth Reddy: పోరు గడ్డ నుంచి ప్రచార హోరు.. ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీ మేసన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తాపీ మేస్త్రీ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తే.. అందులో పేర్కొన్న జీతం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ కాన్సుల్ జనరల్ కార్యాలయంలో మేస్త్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం కూడా ఉంది. వార్షిక వేతనం రూ.4,47,348. నెలవారీ జీతం లెక్కన చూస్తే మేస్త్రీ జీతం రూ.37,279గా నిర్ణయించారు. జీతంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైమ్ జాబ్ గా తెలిపారు. ఈ ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని యుఎస్ కాన్సుల్ వర్గాలు ప్రకటించాయి. ఇది అమెరికన్ కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొనబడింది. ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కనీసం 4 నుండి 8 వారాలు.
Read also: Bandla Ganesh: గత ప్రభుత్వం పై బండ్ల గణేష్ ఫైర్.. అంత మాట అనేశాడు ఏంటి?
అనుభవమే అర్హత…
విధుల్లో భాగంగా కొత్త గోడల నిర్మాణం, కాంక్రీట్ సహా రాతి పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంక్రీట్ మిక్సర్ల రకాలు, వివిధ ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో బ్రిక్స్, రాతి నిర్మాణంలో అనుభవం ఉండాలి. అంతే కాకుండా వివిధ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలి.
గడువు తేది…
మేసన్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 25 లోపు సమర్పించాలి. అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీషు అర్థం చేసుకోవాలి. లెవెల్ 1 ఇంగ్లిష్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది. తెలుగు మరియు హిందీలో స్థాయి 3 వరకు ప్రావీణ్యం పరిగణించబడుతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. సెక్యూరిటీ క్లియరెన్స్‌లలో అర్హత సాధించాలి.
సహాయక ఉద్యోగం…
US కాన్సులేట్ హెల్పర్ ఉద్యోగానికి కూడా దరఖాస్తులు ఆమోదించబడుతున్నాయి. ఫిబ్రవరి 11లోగా దరఖాస్తు చేసుకోవాలి.. వార్షిక వేతనం రూ.3,84,265 చెల్లిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీనితో పాటు సెమీ స్కిల్ టాస్క్‌లు తెలుసుకోవాలి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ మరియు ఇతర పనులలో అనుభవం ఉండాలి. నిర్మాణ సంబంధిత పనులు, మరమ్మతులు, మెటీరియల్ అంచనాల తయారీలో అనుభవం ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. US ఎంబసీలలో పని చేసే ఇతర జాతీయులకు వర్తించే ప్రయోజనాలు అందించబడతాయి. ఇందులో భాగంగానే ఆరోగ్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇతర ప్రయోజనాలు రిక్రూట్‌మెంట్ సమయంలో వివరించబడతాయి. దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం అభ్యర్థి విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా ఇంత జీతం ఎవరూ అందజేయడం లేదని పలువురు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
లింక్ ఇదే..
https://erajobs.state.gov/dos-era/vacancy/viewVacancyDetail.hms?_ref=ztrrmjv3pt0&returnToSearch=true&jnum=56558&orgId=158
Poonam Pandey Death: పూనమ్ పాండే మృతి?.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!