Hyderabad Crime: రోజు రోజుకి ఈ సమాజం ఎటు పోతుందా అనిపిస్తుంది.. ఈ సమాజంలో ఆడవాళ్లకే కాదు ముక్కుపచ్చలారని చిన్నారులకు కూడా రక్షణ లేదు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ఆడపిల్లల పైన జరుగుతున్న దారుణాలను అడ్డుకోలేక పోతుంది. ముళ్ల పొదలో ఇచుక్కుకున్న మేక పిల్లలా..ఇంట్లో బయట ఎక్కడ చూసిన ఆడపిల్ల చుట్టూ శత్రువులే.. కన్న తండ్రి కన్న కూతురి పైనే అత్యాచారానికి పాల్పడిన ఘటనలు.. చిన్నారులపై అఘాయిత్యానికి పాలపడిన సంఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఓ మానవ మృగం చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బోరబండ లో చోటు చేసుకుంది.
Read also:Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్ జరగలేదా? మరీ..!
వివరాలలోకి వెళ్తే.. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సాయి అనే యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి మానవ మృగంలా వ్యవహరించాడు. పసి పాప అని కూడా చూడకుండా.. 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా అర్ధం చేసుకోలేని ఆ బాలిక అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోయారు. చిన్నారి పైన ఆ కిరాతకుడు చేసిన అఘాయాత్యానికి ఆడపిల్ల తల్లిదండ్రులుగా కుమిలిపోయారు. ఆ మానవ మృగాన్ని అలా వదిలేస్తే తన బిడ్డలాంటి ఎందరి బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తాడో అని భావించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.