Cyclone Montha : మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు (జూలై 27, 2025) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన జరగనుంది. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఈ పర్యటన జరుగుతుండటంతో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ, మరియు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు, కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కుట్టు…
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరు డాక్టర్లే.. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయి. కుటుంబ కలహాలతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ హసన్ పర్తిలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రత్యూష అనే వైద్యురాలు. భర్త ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ దంపతులు నగరంలోని రెండు వేర్వేరు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యులగా పనిచేస్తున్నారు. Also Read:Preity Mukundham : ప్రభాస్ పై…
Tiger in Warangal: వరంగల్ జిల్లాలో పులి సంచరిస్తోందన్న వార్త ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూమి కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.
Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
Heavy Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తు న్నాయి.
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు..