దసరా రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖలు చేశారు.కాగా.. తాను కాంగ్రెస్ వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని, పని జరగదని తేల్చేశారు. అంతేకాదు, తాను టీఆర్ఎస్ లో చేరుతానని జరుగుతున్న ప్రచారం ఎన్నటికీ నిజం కాబోదని అన్నారు. ఈనేపథ్యంలో.. ఇకపై తన ఫోకస్ అంతా సంగారెడ్డి నియోజకవర్గంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా.. రాబోయే నాలుగు నెలల పాటు హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు నిర్వహించబోనని వెల్లడించారు. నేను చేస్తానన్న సంచలన ప్రకటనకు ఇంకా సమయం ఉందని జగ్గారెడ్డి దాటవేశారు.
Read also: Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
తన మాటలను కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోరే వ్యాఖ్యలు చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే.. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయని తన మాటలను కూడా వ్యూహంలో భాగంగానే అర్థం చేసుకోవాలని, ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న క్రమంలో శుక్రవారం ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అయితే.. జగ్గారెడ్డికి స్టేట్ లీడర్ పలుకుబడి ఉంది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోనని ఎందుకు ప్రకటించారు? అనే ప్రశ్న, నియోజక వర్గంపైనే దృష్టి సారిస్తాన్న కామెంట్లు ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకీ దసరా నాడు ఆయన ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠతకు తెరలేపుతోంది. జగ్గారెడ్డి ప్రకటనకు దసరా వరకు ఆగాల్సిందే .. ఆరోజు ఎలాంటి ప్రకటన చేయబోతారన్నదే ఉత్కంఠంగా మారింది.
YCP : అకస్మాత్తుగా ఆ వైసీపీ ఎంపీ ఎందుకు వేడి పుట్టిస్తున్నారు?