తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకం పై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది.. ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసీసీ అధిష్టానం చెప్పాలన్నారు.
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది.
గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన…
ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు.
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పేరుతో గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.
బీజేపీకి చెందిన మరో చిత్ర నిర్మాత ఆ పార్టీని వీడి బయటికెళ్లారు. కేరళ చిత్రనిర్మాత ఒకరు బిజెపిని విడిచిపెట్టారు. 2 వారాల్లో ముగ్గురు వ్యక్తులు బీజేపీని వదిలిపెట్టి బయటికెళ్లినట్టు అయింది.
DGCA కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ క్యారియర్ లకు నిబంధనలు మరింత సులభతరం చేసింది. కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాన్ని ప్రారంభించేందుకు భారతీయ క్యారియర్‌లకు ప్రక్రియను సరళంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెక్‌లిస్ట్‌ను కేవలం 10-పాయింట్‌లకు తగ్గించింది.
పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.