భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన వేలం ఇటీవలే ముగియగా.. ఈ వేలంలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఆదానీ డేటా నెట్‌వర్క్స్ పోటీపడి టెలీకాం సెక్టార్లను సొంతం చేసుకున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.. ఇక, 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. టెలికం మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్లతో మరో సంచలనానికి సిద్ధమైంది..
Read Also: Ghattamaneni Indira Devi is No More: మహేష్ బాబు ఇంట విషాదం.. ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూత
అందరికీ అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది రిలయన్స్ జియో.. ఇప్పటికే 4జీ ఫోన్లను తీసుకురావడంలో విజయవంతమైన ఆ సంస్థ.. ఇప్పుడు 5జీపై గురిపెట్టింది.. రూ.8,000 నుంచి రూ.12,000 ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.. దీని కోసం ఇప్పటికే తైవాన్, కొరియా, చైనా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. వందల మిలియన్ల 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను తన 4జీ నెట్‌వర్క్‌కు గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేసిన జియో ఫోన్ నెక్స్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌తో ఆకర్షించింది జియో.. ఇప్పుడు 5జీ ఫోన్ల విషయంలోనూ ఇదే వ్యూహంతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. మొత్తంగా రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి అడుగుపెట్టనుందంటున్నారు విశ్లేషకులు.