తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 48,804 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు అని టీటీడీ తెలిపింది. దీంతో ఏడుకొండలపై ఎటూ చూసినా గోవింద నామస్మరణమే. భక్తులతో సందడి సందడిగా మారింది.…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. నాణ్యత లేని జీడి పప్పు సరఫరా చేసిన టెండర్ ని రద్దు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఏలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కి పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యత పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన…
వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.…
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ,…
ఆ పదవి నుంచి ఎవరు ఉంటారో.. మరెవరు పోతారో తెలియదు. కోర్టు నిర్ణయం.. మెడమీద కత్తిలా వేళ్లాడుతోంది. కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హైకోర్టు విచారణతో సభ్యుల ఉలికిపాటు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో టీటీడీ బోర్డులో సభ్యుడంటే ఆషామాషీ విషయం కాదు. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలూ పోటీపడుతున్నారు. గతంలో…