అధికార పార్టీలో ఆయన సీనియర్ నేత. సీఎంకి దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన ఇప్పుడు సంతృప్తిగా లేరట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని.. చక్రం తిప్పాలని చూస్తున్న ఆ నేత ఫ్యూచర్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరాయన? 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు అధికార పార్టీ వైసీపీలో టీటీడీ తాజా మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చగా…
ఆనందయ్య మందుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మందు వాడటం వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కూడా కాలేదని పేర్కొందని..కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేసి మా వంతు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. కేంద్ర సంస్థ నివేదికల తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నామని..ఎవరి…