విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం అన్నారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తాం అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని ఖాయం అనీ, న్యాయపరమైన చిక్కులు తర్వాత తరలివస్తుంది. దీనికి సంబంధించిన తేదీలు ఇప్పుడే మాట్లాడు కోవడం సరైంది కాదన్నారు.
గోదావరి వరదలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం ఉనికి కోసమే అని మండిపడ్డారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలుగాను ముందు ఉంది. తక్షణ సహాయం అందించడం ద్వారా బాధితులను ఆదుకోగలిగాం. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే, ఫీల్డ్ విజిట్స్ ఎప్పుడు నిర్వహించాలనేది ప్రతిపక్షాలు నిర్ధేశించ లేవన్నారు వైవీ సుబ్బారెడ్డి. అన్నమయ్య కీర్తనల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గాయని శ్రావణ భార్గవి పాటల వివాదం టీటీడీకి సంబంధించినది కాదు. చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం వుంటే పరిశీలిస్తాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటి మీద ఏ విధంగా స్పందిస్తాం అని ఆయన స్పందించారు. వేంకటేశ్వరస్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం అంటే మహా పాపం. తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నాం. అందుకే ఆయన పేరు మీద జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా అన్నమయ్య మార్గంను అభివృద్ధి చేసి తిరుమలకు మూడో దారిని అందుబాటులోకి తీసుకుని వస్తాం అని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
Krunal Pandya: తండ్రి అయిన భారత ఆల్‌రౌండర్.. ఆనందంలో మునిగితేలుతున్న క్రికెటర్