రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు.
రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తిరిగి చెల్లించే స్థితిలో లేవు.వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను కేంద్రం ఎంతకాలం రక్షిస్తుంది?మరలా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని జగన్ చూస్తున్నారన్నారు యనమల.
జగన్ తన పార్టీ గురించి తప్ప రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడం లేదు.అవినీతి సొమ్ము జమచేసుకుని దానితో రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారు.అవినీతి, అక్రమాలు, లూటీతో జగన్ సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలి.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నగదు బదిలీ పథకం ఒక ప్రహసనం లాంటిది.విదేశీ విద్య తీసేసి విద్యార్థులను మోసం చేశారు.
45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మహిళలను మోసం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పింఛన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు.కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రైతులకు 12,500 ఇస్తానని, రూ.6,500 ఇచ్చి మోసం చేశారు. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తానని మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులును మోసం చేశారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని ఒక్కరికి మాత్రమే ఇస్తామంటూ మోసం చేశారు.
Read Also: Lock Down Village: వెన్నెలవలస.. అక్కడ ఇప్పటికీ లాక్ డౌన్