విశాఖ సాగర తీరం తిరుమల వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మరింతగా పులకించనుంది. భక్త కోటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 23 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలిసి భక్తులు ఆనందపరవశులవుతున్నారు. ఆధ్యాత్మిక శోభతో విశాఖ సాగరతీరం మరింత కమనీయంగా మారనుంది. సుప్రభాతం సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది. ఋషికొండ సమీపంలో తిరుమల…
సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని ఆయన వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు…
కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే, టీటీడీ నిర్ణయాల వల్ల శ్రీవారు భక్తులకు దూరం అవుతారని మండిపడుతున్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల కేశవ్ ఫైర్ అవుతున్నారు. భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలు శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్దంగా జరుగుతున్నాయన్నారు. తిరుమల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.సామాన్య భక్తులకు ఏడుకొండల వాడిని దూరం…
తిరుమలలో నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలుతో కూడిన అజెండాను అధికారులు రూపొందించారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే రూ.3,171 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించనుంది. హుండీ ద్వారా వెయ్యి కోట్లు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన నేఫథ్యంలో దర్శన టికెట్లు పెంచడంతో పాటు ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై టీటీడీ…
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాజా పరిణామాలపై గుర్రుగా వున్నారు. నా వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారు.గత ఎన్నికల నుంచి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి…ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడ్డాయన్నారు. నా ఫ్లెక్సీలు నేనే వేసుకోను.. కార్యకర్తలే వేస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయినా…వంకా రవి ఫ్లెక్సీల్లో నా బొమ్మ వేయలేదు. వంకా రవి పార్టీ పక్కన పెట్టిన సాయిరాం అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు. అందుకే నేను చిరాకు పడ్డాను.…
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది. కళాశాల భవనాల…
ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్‌గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాదిన ఢిల్లీ,…
కష్టపడ్డారు. అబ్బాయికి అండగా నిలబడ్డారు. అధికారంలోకి వస్తున్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈసారైనా లైన్‌లోకి రావాలనుకున్నా అధినేత అవకాశం ఇవ్వలేదు. దీంతో రూటు మార్చారు. అడగకుండానే వచ్చిన స్వామి కార్యానికి న్యాయం చేస్తూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ స్వకార్యాన్నీ నెరవేర్చుకుంటున్నారట. ఎవరాయన? ఏమా కథ..చూద్దామా..! స్వామి కార్యం.. స్వకార్యంలో వైవీ! TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూట్ మార్చారు. మొదటి విడతలో ఓన్లీ TTD మీదే దృష్టి పెట్టిన YV రెండోదఫా ప్రత్యక్ష…
టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తాజాగా ఎన్టీవీతో మాట్లాడినా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు. నాకు మరోసారి చ్చినందుకు సంతోషిస్తున్న. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే. భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా.. టీటీడీలో గతంలో…