Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
- అల్లనేరేడు పండ్లతో ఇంట్లోనే టేస్టీ జామ్
- కేవలం 3 పదార్థాలతో సింపుల్ రెసిపీ
- పిల్లలు ఇష్టపడే కలర్‌ఫుల్ హెల్తీ స్ప్రెడ్
- ఫ్రిజ్‌లో నెలల పాటు నిల్వ ఉండే జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neredu Jam : నేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిలో ఉండే కొద్దిపాటి వగరు రుచి వల్ల చాలామంది పిల్లలు వీటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం అల్లనేరేడు పండ్లతో ఇంట్లోనే రుచికరమైన, కలర్‌ఫుల్ జామ్‌ను తయారు చేసి పెట్టవచ్చు. ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు లేకుండా కేవలం మూడు వస్తువులతోనే దీనిని సిద్ధం చేయవచ్చు. బ్రెడ్, చపాతీ, పూరీలపై ఈ జామ్ రాసి ఇస్తే, పిల్లలు ప్లేట్లు ఖాళీ చేయడమే కాకుండా లొట్టలేసుకుంటూ మరీ తింటారు.
అల్లనేరేడు పండ్ల జామ్ తయారీకి కావలసిన పదార్థాలు
Also Read
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
- అల్లనేరేడు పండ్లు – అర కిలో (500 గ్రాములు)
- చక్కెర లేదా బెల్లం పొడి – ఒక కప్పు (పండ్ల తీపిని బట్టి సర్దుబాటు చేసుకోవాలి)
- నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
పండ్లను శుభ్రం చేయడం , గుజ్జు తీయడం
ముందుగా అల్లనేరేడు పండ్లను ఉప్పు వేసిన నీటిలో రెండు, మూడు సార్లు బాగా కడిగి, తడి లేకుండా ఒక పొడి గుడ్డతో తూడ్చుకోవాలి. ఆ తర్వాత పండ్ల నుండి గింజలను వేరు చేసి, కేవలం గుజ్జును (పండ్ల ముక్కలను) ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసి ఎలాంటి నీరు కలపకుండా మెత్తటి ప్యూరీలా (గుజ్జులా) గ్రైండ్ చేసుకోవాలి. పండ్ల తొక్కలలోనే ఎక్కువ పోషకాలు , ముదురు రంగు ఉంటాయి కాబట్టి తొక్కలతో సహా గ్రైండ్ చేసుకోవడం మంచిది.
చిన్న మంటపై ఉడికించే విధానం
ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం మందం ఉన్న పాన్ , నాన్-స్టిక్ కడాయిని పెట్టుకోవాలి. అందులో మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లనేరేడు పండ్ల గుజ్జును వేయాలి. దీనికి ఒక కప్పు చక్కెర లేదా ఆర్గానిక్ బెల్లం పొడిని జోడించాలి. స్టవ్‌ను చిన్న మంటపై (Low Flame) ఉంచి, చక్కెర పూర్తిగా కరిగేలా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత ఈ మిశ్రమం కాస్త పల్చగా మారుతుంది.
పాకం చెక్ చేయడం , నిల్వ చేసుకోవడం
ఈ మిశ్రమాన్ని చిన్న మంటపైనే ఒక 10 నుండి 15 నిమిషాల పాటు దగ్గర పడేవరకు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి, పాన్‌కు అంటుకోకుండా జెల్లీ లాగా మారుతున్నప్పుడు జామ్ తయారైందని అర్థం. కచ్చితంగా తెలియాలంటే ఒక ప్లేట్లో కొద్దిగా జామ్ వేసి ప్లేట్‌ను వంచి చూడాలి. అది నీళ్లలా జారిపోకుండా గట్టిగా ఒకే చోట ఉంటే జామ్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే.
చివరగా ఇందులో ఒక చెంచా నిమ్మరసం కలపాలి. ఈ నిమ్మరసం జామ్ లోని చక్కెర గట్టిపడకుండా (Crystallize అవ్వకుండా) చూడటమే కాకుండా మంచి ప్రిజర్వేటివ్‌గా పనిచేసి జామ్ పాడవకుండా కాపాడుతుంది. నిమ్మరసం కలిపిన ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జామ్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన ఈ అల్లనేరేడు జామ్‌ను తడి లేని ఒక గాజు సీసాలో (Glass Jar) భద్రపరుచుకుంటే ఫ్రిజ్‌లో పెట్టి కొన్ని నెలల పాటు పిల్లలకు ఎంతో ఇష్టంగా వడ్డించవచ్చు.
తాజావార్తలు
-
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
-
DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
-
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
-
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
-
Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!