LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్‌లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీల పేర్లతో నకిలీ ఈమెయిల్‌లు, ఎస్ఎంఎస్లు, వెబ్సైట్ లింకులు చేరుతున్నాయి. ఇవి చూడటానికి పూర్తిగా అధికారిక సమాచారంలానే కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది అవి నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ డీలర్షిప్ లేదా గ్యాస్ ఏజెన్సీ కేటాయిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారిని టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నకిలీ సందేశాల వెనుక ఉన్నవారు ప్రజల ఆధార్ నంబర్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా తిరిగి చెల్లించే డిపాజిట్ పేరుతో డబ్బులు కూడా అడుగుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ ఫిషింగ్ మోసాల్లో భాగమని పీఐబీ స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎప్పుడూ వ్యక్తిగత ఈమెయిల్ ఐడీల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా లేదా వాట్సాప్ సందేశాల ద్వారా డీలర్షిప్ ఆఫర్లు పంపవని పీఐబీ వెల్లడించింది. అలాగే డీలర్ల ఎంపిక బాధ్యతను ఎలాంటి వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు అప్పగించవని కూడా స్పష్టం చేసింది. అధికారిక విధానాల వెలుపల ఎలాంటి రుసుములు చెల్లించమని కోరవని పేర్కొంది. కాబట్టి ఇలాంటి సందేశాలు అందితే వెంటనే వాటిని అనుమానాస్పదంగా భావించి జాగ్రత్త పడాలని సూచించింది.
ఎల్పీజీ డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు అధికారిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెలెక్షన్ పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వెబ్సైట్లు, లింకులు లేదా మెసేజ్‌లలో ఇచ్చిన దరఖాస్తు అవకాశాలను నమ్మడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయకూడదు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లు లేదా ఈమెయిల్‌లకు ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు పంపకూడదు. ప్రభుత్వ పథకాలు, డీలర్‌షిప్‌లు లేదా ఏజెన్సీలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లలోనే ధృవీకరించుకోవాలి. డిజిటల్ యుగంలో అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!