తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. నాణ్యత లేని జీడి పప్పు సరఫరా చేసిన టెండర్ ని రద్దు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఏలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కి పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యత పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. ప్రసాదాల నాణ్యాత పై భక్తులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సరుకుల గోడౌన్ లో తనిఖీలు నిర్వహించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు వేసవి సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ బాగా పెరిగింది. అలిపిరి వద్ద భారీగా బారులు తీరాయి భక్తుల వాహనాలు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో తిరుమలలో క్యూ లైన్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి.
మరో వైపు అలిపిరి వద్ద గరుడ సర్కిల్ వద్ద వాహనాలు బాగా పెరిగిపోయాయి. వాహనాల తనిఖి కోసమే ….అలిపిరి వద్ద గంట సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు 73,358 మంది భక్తులు…41,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు అని టీటీడీ తెలిపింది.
West Bengal: వధువు భారీ మోసం.. పెళ్లైన కాసేపటికే వరుడికి షాక్