వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.
శెట్టి బలిజ వర్గాలు పార్లమెంటు మెట్లు ఎక్కే అవకాశం కల్పించిన మొదటి నాయకుడు జగన్. హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కొమరం భీం, అంబేద్కర్, జ్యోతి రావు పూలే ఆకాంక్షించినట్లు బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. జగన్ పాలనలో సమ సమాజ పాలన చూశాం.
గతంలో ఏ ప్రభుత్వమూ బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. హోం శాఖ వంటి కీలక బాధ్యతలు నాకు ఇచ్చారంటేనే ముఖ్యమంత్రి మనసు అర్ధం అవుతుంది. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యుగం అన్నారు హోంమంత్రి తానేటి వనిత. జనసేనకు సోషల్ మీడియా ఉంది. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. జగన్ కు జనమే మీడియాగా ఉందన్నారు తానేటి వనిత. సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ న్యాయబేరి బహిరంగ సభలో పాల్గొన్నారు 17 మంది మంత్రులు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదు. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వటమే సామాజిక న్యాయ జరిగినట్లు కాదు. ప్రజలకు లక్షా 20 వేల కోట్లు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించింది. దీని కోసం ఎవరూ రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. గౌరవం గా తీసుకున్నారు. చంద్రబాబు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చాను అంటున్నాడు. దీని కోసం జన్మభూమి కమిటీల ముందు తల వంచుకోవాల్సి పరిస్థితి ఉండేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని కనీసం ఆరోపించగలుగుతున్నాడా??ఈ సభకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Nikhat Zareen : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రాణిస్తా