ఇందిరా శోభన్ పార్టీ వీడటంపై వైఎస్సార్ టిపి స్పందించింది. ఇందిరా శోభన్ ని నాయకురాలిగా తయారు చేశామని… ఆమె పార్టీని వీడటంతో ఎటువంటి నష్టం లేదని తెలిపారు వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి. ఆరు చోట్ల వైఎస్ షర్మిల ఇప్పటి వరకు నిరుద్యోగ దీక్షలు చేశారని..7వ నిరుద్యోగ దీక్ష మంగళవారం మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు తూడి దేవేందర్ రెడ్డి. హుజురాబాద్ లో ఉప ఎన్నిక కోసమే…
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి అని వైస్సార్ తెలంగాణ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైస్సార్ తెలంగాణ…
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి…
కొత్త గా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడు గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సర్కారే టార్గెట్ గా కార్యచరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సోమ్ల తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబానికి ఈ సందర్భంగా పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత అదే జిల్లాలోని గుండెంగి గ్రామం లో షర్మిల ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఇక ఇవాళ రాత్రి వరంగల్ లోనే…
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం…
షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ…
తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో…
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల… ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టారు… ప్రతీ మంగళవారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తూ వస్తున్నారు.. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా చెబుతున్న ఆమె.. రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు.. ఆగస్టు 5వ తేదీ నుంచి జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు వైఎస్…
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా తిరిగి బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతున్నది. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ దృష్టిమొత్తం ఏపీపైనే ఉంచడంతో తెలంగాణలో పార్టీ వెనుకబడిపోయింది. ఇక, 2018 తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే చేయలేదు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా బలహీనపడింది. ఒకప్పుడు అనేక మంది కార్యకర్తలు, నేతలు ఉండేవారు.…
షర్మిళ పార్టీ కార్యాలయంలో పదవుల కేటాయింపు పై రభస జరిగింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి. పార్టీ పదవులు 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని వ్యాఖ్యలు చేసిన నర్సింహారెడ్డి… షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో…