ఇందిరా శోభన్ పార్టీ వీడటంపై వైఎస్సార్ టిపి స్పందించింది. ఇందిరా శోభన్ ని నాయకురాలిగా తయారు చేశామని… ఆమె పార్టీని వీడటంతో ఎటువంటి నష్టం లేదని తెలిపారు వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి. ఆరు చోట్ల వైఎస్ షర్మిల ఇప్పటి వరకు నిరుద్యోగ దీక్షలు చేశారని..7వ నిరుద్యోగ దీక్ష మంగళవారం మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు తూడి దేవేందర్ రెడ్డి. హుజురాబాద్ లో ఉప ఎన్నిక కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని… హుజురాబాద్ ఉప ఎన్నికలో వంద నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మేము చేరికల కోసం పనిచేయడం లేదని… క్యాడర్ ని కొత్తగా తయారుచేసే పనిలో ఉన్నామన్నారు.