కొత్త గా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడు గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సర్కారే టార్గెట్ గా కార్యచరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సోమ్ల తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబానికి ఈ సందర్భంగా పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత అదే జిల్లాలోని గుండెంగి గ్రామం లో షర్మిల ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఇక ఇవాళ రాత్రి వరంగల్ లోనే బస చేయనున్న షర్మిల… ఉద్యోగ దీక్ష తో పాటు పోడు భూముల కై పోరు కు రేపటి రోజున శ్రీకారం చుట్టనున్నారు షర్మిల. ఇందులో భాగంగానే ములుగు జిల్లా లింగాల గ్రామం లో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం రేపు సాయంత్రం లోగా హైదరాబాద్ రానున్నారు.