షర్మిళ పార్టీ కార్యాలయంలో పదవుల కేటాయింపు పై రభస జరిగింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి. పార్టీ పదవులు 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని వ్యాఖ్యలు చేసిన నర్సింహారెడ్డి… షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నారు. తాగుబోతు గాళ్ళకి పదవులు అమ్ముకొని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకొని వెళ్లారని తీవ్ర ఆరోపణలు చేసారు నర్సింహారెడ్డి.