వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిరుద్యోగ సమస్యను ఆయుధంగా మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనికోసం ప్రతీ మంగళవారం ఒక చోట నిరుద్యోగ దీక్ష చేస్తూ వస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ.. వారికి ఆర్థికసాయం చేయడం.. ఆ తర్వాత కొన్ని గంటల పాటు దీక్ష చేస్తూవస్తున్నారు. అయితే, దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళనకు దిగడం చర్చగా మారింది.. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి..…
వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే… వైఎస్ షర్మిల నిరుద్యోగ-నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు…అనంతరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత షర్మిలను మేడిపల్లి పీఎస్‌కు తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యం లో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరికి వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలను క్లియర్ చేసి…. వైఎస్ షర్మిల ను మేడిపల్లి పీఎస్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటన పై…
వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య మైన ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేశారు వైఎస్ షర్మిల. అయితే… ఇవాళ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు వైఎస్ షర్మిల. అయితే.. నేడు షర్మిల చేపట్టబోయే నిరుద్యోగ దీక్ష కు ఆటంకం కలిగింది. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. సభ ఏర్పాట్లు చేయడానికి వీలు లేదంటూ……
వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పటి నుంచి.. వరుసగా సభలు నిర్వహిస్తూ పోతున్నారు. రాజకీయంగా ఆమె చేస్తున్న విమర్శలు, తిరిగి ఆమెపై వస్తున్న ప్రతి విమర్శలు పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేస్తున్న అడుగులు.. ముచ్చటగా ఉన్నాయని.. న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా.. వైఎస్ జగన్ తోడబుట్టిన సోదరిగా.. ఆమె ప్రతిభ చాటుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా.. జగన్ ఏ ర్యాలీ చేసినా.. ఏ సభ నిర్వహించినా.. జన ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది.…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss…
రేపు వైఎస్సార్ 12వ వర్ధంతి ఉన్న నేపథ్యం లో ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే… లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్ షర్మిల. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ దగ్గర విజయమ్మ తో కలిసి నివాళులు అర్పించనున్నారు వైఎస్ షర్మిల. ఇక ఆ కార్యక్రమం అయ్యాక… రేపు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు…
రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 2న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత…
సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రేపు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయనున్నారు.. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం అనంతరావు పల్లి లో ఆరు నెలల క్రితం ఉద్యోగం రాలేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంభ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. పరామర్శ అనంతరం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో నిరోద్యోగ దీక్షలో పాల్గొననున్నారు వైఎస్. షర్మిల. అయితే… వర్షం కారణంగా…
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా…