గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్... విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన…
సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.
మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.
ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ హరివెంకట కూమారిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు..
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి…
కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీ ఇలా తదితర ప్రాంతాల్లో పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. బంధువులు, స్నేహితుల నివాసాలపై కూడా నిఘా పెట్టారు పోలీసులు.. అయితే, కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి…
కొద్దిగంటలు మాత్రమే సమయం...! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి.
ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదు.. నేను ఆఫర్ ఇస్తున్నాను.. వైసీపీ వాళ్లు కానీ ఎవరైనా కావచ్చు ఆయన ఆచూకీ తెలిపితే కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ఆలోచిస్తున్నా అని ప్రకటించారు.. అందరూ ముందుకు రండి.. కాకాణి ఆచూకీ తెలపాలని కోరారు..