ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే కాగా, ఆ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జగన్.. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనే ఉండాలని స్పష్టం చేశారాయన.. ఇక, త్వరలోనే వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు జరుగుతుండగానే వైఎస్సార్ సీఎల్పీ భేటీ ఉంటుందని తెలిపారు సీఎం జగన్… గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అనంతరం సీఎల్పీ భేటీ జరిగింది.. 2019 తర్వాత ఇప్పటి వరకు వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరిగిందే లేదు.. కానీ, బడ్జెట్ సెషన్ జరిగే క్రమంలోనే సమావేశం ఉంటుందని తెలిపారు సీఎం.. త్వరలో జరగబోయే వైఎస్సార్ సీఎల్పీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు సీఎం జగన్. కేబినెట్‌లో మార్పులు చేర్పులపై కూడా సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టే అంశంపై మంత్రులకు.. ఎమ్మెల్యేలకు సూచనలు చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Governor Tamilisai: నన్ను ఎవరూ భయపెట్టలేరు.. దేనికి భయపడను..