Mandra Sivananda Reddy: లోకేష్‌ను కలవడానికి బైరెడ్డి ఎంతో మంది కాళ్లు పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిపై నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైసీపీ నాయకులు చెప్పాలని మాండ్ర శివానందరెడ్డి డిమాండ్ చేశారు. రియల్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నందికొట్కూరులో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. డాక్టర్‌పై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని మాండ్ర శివానందరెడ్డి విమర్శలు చేశారు.
టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్లు పట్టుకుని నారా లోకేష్‌ను కలిశారో అందరికీ తెలుసు అని మాండ్ర శివానందరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్‌ను గెలిపించింది పార్టీ కానీ వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఇంఛార్జ్ వాపు చూసుకుని బలుపు అనుకుంటున్నారని.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సొంత పార్టీ పెట్టి విఫలమైన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాగా ఇటీవల తాను టీడీపీ చేరతానని వస్తున్న వార్తలను బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించానని.. తాను నారా లోకేష్‌ను కలిసినట్లు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆధారాలు చూపించాలని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి సవాల్ విసిరిన సంగతి విదితమే.
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!