ఏపీలో వైసీపీ కీలక నేతలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు.
కాగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సీఎం జగన్ కీలకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. 2024 ఎన్నికలకు సమాయాత్తం అయ్యేందుకు త్వరలోనే క్షేత్రస్థాయిలో సీఎం జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది.